Mokshagna: మోక్షజ్ఞ మొదటి సినిమాకే భారీ బడ్జెట్.. అంత నమ్మకం ఏంటయ్యా?

1 Min Read

Mokshagna: నందమూరి నట సింహం బాలకృష్ణ వారసుడిగా మోక్షజ్ఞ అతి త్వరలోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే మోక్షజ్ఞ మొదటి సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేశారు. ఇక మోక్షజ్ఞ ఇప్పటికే సినీ ఎంట్రీ ఇవ్వాల్సి ఉండగా కొన్ని కారణాలవల్ల వాయిదా పడుతూ వస్తుంది. ఇక ఈయన సినిమాని అతి త్వరలోనే ప్రకటించబోతున్నారు.

ప్రస్తుతం మోక్షజ్ఞ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పనులు ప్రారంభం కానున్నాయి. మోక్షజ్ఞను ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారంటూ ఎంతో మంది దర్శకుల పేర్లు తెరపైకి వచ్చాయి కానీ ఆ అవకాశాన్ని యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అందుకున్నారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (పీవీసీయూ)లో రెండో చిత్రంగా ఈ మూవీ ఉండనుంది.

మోజ్ఞక్షతో ప్రశాంత్ వర్మ తెరకెక్కించే ఈ చిత్రం కూడా పురాణాల ఆధారంగానే ఉంటుందని తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాకు భారీ స్థాయిలో బడ్జెట్ కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు ఏకంగా 100 కోట్లు బడ్జెట్ కేటాయించారని తెలుస్తోంది. ఈ విధంగా ఒక డెబ్యూ హీరో సినిమాకు ఈ స్థాయిలో బడ్జెట్ కేటాయిస్తున్నారు అంటే నిజంగానే సాహసం అని చెప్పాలి. ఇక ఇండస్ట్రీలోకి రాకముందే మోక్షజ్ఞకు ఉన్న క్రేజ్ దృష్టిలో పెట్టుకొని ఈ స్థాయిలో బడ్జెట్ ఖర్చు చేయడానికి నిర్మాతలు కూడా వెనకాడలేదని సమాచారం.

ఈ చిత్రాన్ని ఎస్‍ఎల్‍వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మించనున్నారు. లెజెండ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బాలయ్య కూతురు నందమూరి తేజస్విని సమర్పించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇటీవల మోక్షజ్ఞ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయగా సినిమా పై కూడా అంచనాలు పెరిగిపోయాయి.

Share This Article