Anasuya: సినీ ఇండస్ట్రీలో ప్రముఖ కొరియోగ్రాఫర్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్న డ్యాన్స్ మాస్టర్ జానీ పై లైంగిక వేధింపుల కేసు నమోదు కావడం సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఆయన అసిస్టెంట్ జానీ మాస్టర్ పై లైంగిక ఆరోపణలు చేస్తే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. జానీ మాస్టర్ తన పట్ల లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని తనపై అత్యాచారం కూడా చేశారు అంటూ ఈమె కేసు నమోదు చేయడంతో ఇండస్ట్రీలో ఈ విషయం గురించి ప్రతి ఒక్కరు స్పందిస్తున్నారు.
ఈయన పట్ల అత్యాచార ఆరోపణలు రావడంతో ఫిలిం ఛాంబర్ సైతం జానీ మాస్టర్‌పై చర్యలు తీసుకుంది.అతన్ని డ్యాన్స్ అసోసియేషన్ నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిజ నిర్ధారణ జరిగే వరకు ఇది అమలులో ఉంటుంది అంటూ ఫిలిం ఛాంబర్ సైతం అతనిపై వేటు వేస్తుంది.ఇకపోతే తాజాగా నటి అనసూయ సైతం జానీ మాస్టర్ వ్యవహారంపై మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే అనసూయ ఇంస్టాగ్రామ్ వేదికగా ఈ ఘటనపై స్పందిస్తూ సుదీర్ఘమైన పోస్ట్ చేశారు. మహిళలకు సానుభూతి అవసరం లేదు. ఇన్ని రోజులు ఆమె అనుభవించిన బాధ వర్ణాతీతం. మహిళలు ఏదైనా ఇబ్బందులను ఎదుర్కొంటే వెంటనే బహిరంగంగా అందరికీ తెలిసేలా చెప్పాలి. ఇలాంటి విషయాలలో అమ్మాయిల పట్ల మహిళల పట్ల సానుభూతి అవసరం లేదు.ప్రశ్నించే తత్వం నేర్చుకోవాలని మహిళలకు హితవు పలికారు. మీరు గానీ, మీకు తెలిసినవాళ్లు గాని అసౌకర్యమైన, అగౌరవకరమైన పరిస్థితులు ఎదుర్కుంటున్నారని తెలిపారు.
ఇలాంటి విషయాలలో మీకు అందరూ తోడుగా ఉంటారు అంటూ అనసూయ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. అంతేకాకుండా నేను బాధితురాలితో కొన్ని రోజులు పనిచేశాను. పుష్ప సెట్స్ లో రెండు, మూడుసార్లు చూశాను. కానీ, ఆ అమ్మాయి ఎదుర్కొన్న ఇబ్బందులు బయటకు కనిపించలేదు.బాధితురాలుకు మద్దతుగా నిలువడానికి, మాట్లాడటానికి ముందుంటాను. ఈ కేసులో అమ్మాయికి న్యాయం అందించాలి. మున్ముందు ఇలాంటి పరిస్థితులు ఇండస్ట్రీలో ఏ మహిళకు ఎదురు కాకూడదు అంటూ ఈమె ఈ ఘటనపై చేసిన ఈ సుదీర్ఘమైన పోస్ట్ వైరల్ అవుతుంది.