Siddharth : సినీ నటుడు సిద్దార్థ్ ఇటీవల నటి అదితి రావు హైదరిని పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిజానికి వీరిద్దరికీ ఇదివరకే వేరే వ్యక్తులతో పెళ్లి జరిగినప్పటికీ విడాకులు తీసుకుని విడిపోయారు. ఇలా విడాకులు తీసుకుని సింగిల్ గా ఉన్న వీరిద్దరు తిరిగి ప్రేమలో పడ్డారు. వీరిద్దరూ కలిసి డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో మహాసముద్రం అనే సినిమాలో నటించారు.
ఈ సినిమా సమయంలోనే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడటం ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడం జరిగింది. ఇక ఈ సినిమా సమయం నుంచి వీరిద్దరూ ఎక్కడ కనిపించిన జంటగా కనిపించడం అలాగే ఇద్దరు కలిసి సహజీవనం చేస్తూ ఉండటంతో వీరి రిలేషన్ పై ఎన్నో రకాల వార్తలు వచ్చాయి. చివరికి వీరిద్దరూ ప్రేమలో ఉన్నామంటూ తమ రిలేషన్ గురించి బయట పెట్టడమే కాకుండా వనపర్తి జిల్లాలోని రంగనాథ స్వామి ఆలయంలో నిశ్చితార్థం కూడా చేసుకున్నారు.
Also Read : Kajal Agarwal తో రొమాన్స్… భయపడిన స్టార్ హీరో.. ఎవరంటే?
the cost of this watch that Siddharth wore in his wedding
ఇలా నిశ్చితార్థం అనంతరం అదే ఆలయంలోని ఇటీవల ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వీరి వివాహానికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఫోటోలలో భాగంగా సిద్దార్థ్(Siddharth) చేతికి కట్టిన వాచ్ అందరి దృష్టిని ఆకర్షించడంతో ఈ వాచ్ గురించి ఆరా తీయడం మొదలుపెట్టారు. అయితే ఈ వాచ్ చూడటానికి చాలా సింపుల్ గా కనిపిస్తున్న ఖరీదు తెలిస్తే మాత్రం దిమ్మతిరిగి పోవాల్సిందే.
సిద్ధార్థ్ ధరించిన గోల్డ్ కేస్తో కూడిన ఆడెమర్స్ పిగ్వెట్ రాయల్ ఓక్ వాచ్ ధర రూ.27.62 లక్షలు అని సమాచారం. ఇక వారి పెళ్లి ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన అదితి నువ్వు నా సూర్యుడు, నా చంద్రుడు మరియు నా నక్షత్రాలన్నీ… శాశ్వతత్వం కోసం పిక్సీ సోల్మేట్స్గా ఉండటానికి.. నవ్వడానికి, ఎప్పటికీ ఎదిగే శాశ్వతమైన ప్రేమకు, కాంతికి & మ్యాజిక్ శ్రీమతి & మిస్టర్ అదు-సిద్ధు అంటూ ఓ కొటేషన్ షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ అలాగే వీరి పెళ్లి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.