Devara Pre release : టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో ఎన్టీఆర్ ప్రస్తుతం కేవలం మాస్ యాక్షన్ సినిమాలతోనే లైన్లో ఉన్నాడు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఆయన నుంచి వస్తున్న సినిమా కావడంతో అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. టాలీవుడ్ మాస్ బ్రహ్మ కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా రాబోతోంది. సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు.ఇక ఇంకా రెండ్రోజులు మాత్రమే ఉండడంతో చిత్రబృందం ప్రమోషన్ల జోరు పెంచింది.. మొన్న ట్రైలర్‌ని విడుదల చేశారు. ఇప్పుడు అందరి దృష్టి ప్రీ రిలీజ్ ఈవెంట్ పైనే ఉంది.
దేవర ప్రీ-రిలీజ్ ఈవెంట్ తేదీని మేకర్స్ ఇటీవల లాక్ చేశారు. ఈ నెల 22న హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు మేకర్స్ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ ఈవెంట్‌కి కొరటాల ఎవరిని ముఖ్య అతిధులుగా తీసుకురాబోతున్నారు అనే వార్తలు వస్తున్నాయి. అయితే గత కొన్ని రోజులుగా చిరంజీవి రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మహేష్ బాబు వచ్చే అవకాశం ఉందని కూడా ప్రచారం జరిగింది. మరి ఈ ఇద్దరేనా వీరితో పాటు ఇంకెవరైనా వస్తారో లేదో చూడాలి. ఈ వేడుకకు బాలీవుడ్ ప్రముఖులు కూడా హాజరుకానున్నట్లు సమాచారం.
ఇక ఇప్పటివరకు దేవర నుంచి వచ్చిన అప్డేట్స్ అన్నీ అభిమానుల్లో ఉత్కంఠను రేపుతున్నాయి. తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేస్తుంది. ఆచార్యతో ప్లాప్ కొట్టిన కొరటాల శివ.. ఈసారి భారీ హిట్ కొట్టి ఆచార్య మచ్చను తొలగించుకోవాలని చూస్తున్నాడు. దేవర నుంచి ఇప్పటివరకు విడుదలైన పోస్టర్లు, వీడియోలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అలాగే ఈ సినిమా నుండి విడుదలైన పాటలు ప్రేక్షకులను శ్రోతలను థ్రిల్ చేస్తున్నాయి. అంతే కాకుండా సినిమా హక్కులు భారీ రేట్లకు అమ్ముడు పోయాయి. ఒక్క నైజాం హక్కులు రూ.40 కోట్లకు అమ్ముడుపోయాయి. ఓవరాల్ గా ఈ సినిమా బిజినెస్ రూ.150 కోట్లు-రూ.180 కోట్ల రేంజ్ లో జరగనుంది. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది.
ఆర్ఆర్ఆర్ తర్వాత వస్తున్న ఈ సినిమా కావడంతో అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. నందమూరి అభిమానులే కాదు యావత్ తెలుగు ప్రేక్షకులు ‘దేవర’ సినిమా కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. అంతేకాకుండా ఆర్ఆర్ఆర్ వంటి అరివీర భారీ హిట్ తర్వాత తారక్ చేస్తున్న సినిమా కావడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఇప్పటి వరకు విడుదలైన అప్డేట్స్ భారీ హైప్ క్రియేట్ చేస్తున్నాయి. మరి సినిమాకు ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి. ఏది ఏమైనా ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.