ఘనంగా Bigg Boss Sujatha సీమంతపు వేడుకలు.. ఫోటోలను షేర్ చేసిన రాకింగ్ రాకేష్!

2 Min Read

Bigg Boss Sujatha : బుల్లితెరపై ప్రసారం అవుతున్న జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు కమెడియన్ రాకింగ్ రాకేష్. ఇక ఈయన టీంలో సుజాత కమెడియన్ గా చేస్తూ సందడి చేసేవారు. ఇలా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా వీరిద్దరూ ప్రేమలో పడటం పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇక పెళ్లి తర్వాత కూడా సుజాత పెద్ద ఎత్తున వెబ్ సిరీస్ లలో నటిస్తూనే సందడి చేస్తున్నారు.

ఇదిలా ఉండగా సుజాత త్వరలోనే తల్లి కాబోతోంది అనే విషయం మనకు తెలిసిందే. ఈమె ప్రెగ్నెన్సీకి సంబంధించిన కొన్ని ఫోటోలు ఇదివరకు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సెప్టెంబర్ నెలలోనే ఈమె డెలివరీ డేట్ ఉన్న నేపథ్యంలో రాకింగ్ రాకేష్ సీమంతపు వేడుకలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. గత కొద్ది రోజుల క్రితం ఈమె సీమంతపు వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి.

Also Read : Bigg Boss 8: బిగ్ బాస్ హౌస్ లోకి చేతి వాచ్ కి అనుమతి లేదా..కారణం అదేనా?

ఇక తాజాగా రాకింగ్ రాకేష్ సుజాత సీమంతపు వేడుకలకు సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు. ఈ వేడుకలలో భాగంగా సన్నిహితులు సినీ సెలబ్రిటీలు కూడా హాజరై సందడి చేశారు. ఇక ఈ ఫోటోలను షేర్ చేసిన ఈయన ఈ సమయంలో సుజాత ఆనందం చూస్తుంటే తన ఆనందానికి అవధులు లేవని తెలిపారు. నీ మీద నా ప్రేమకు అవధులు లేవు అంటూ తన భార్యపై ఉన్న ప్రేమను బయటపెట్టారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో వీరి అభిమానులు ముందుగానే ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

మరి కొద్ది రోజులలో సుజాత బిడ్డకు జన్మనివ్వబోతున్నారని ఓ మంచి శుభవార్తను తెలియజేయబోతున్నారని తెలుస్తోంది. ఇక రాకేష్ జబర్దస్త్ కార్యక్రమంలో సందడి చేస్తూనే మరోవైపు సినిమాలలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇక రాకేష్ నిర్మాతగా హీరోగా ఓ సినిమాని కూడా చేసిన సంగతి తెలిసిందే అయితే ఈ సినిమా ఇంకా విడుదలకు నోచుకోలేదు.

Share This Article