Bigg Boss 8: బుల్లితెరపై ప్రసారమవుతూ ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్న కార్యక్రమాలలో బిగ్ బాస్ రియాలిటీ షో ఒకటి. ఈ కార్యక్రమం కేవలం తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషలలో కూడా ప్రసారమవుతూ ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ప్రస్తుతం తెలుగులో ఈ కార్యక్రమం 8వ సీజన్ ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. అయితే తెలుగులో ఇటీవల ప్రసారమైన సీజన్లో అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయాయి. దీంతో సీజన్ సెవెన్ ను ఉల్టా పుల్టా అంటూ సరికొత్త విధంగా నిర్వాహకులు ప్లాన్ చేయడంతో మంచి రేటింగ్ కైవసం చేసుకుంది.
ఇలా సీజన్ సెవెన్ మంచి సక్సెస్ కావడంతో 8 అంతకుమించి ఉండాలన్న ఉద్దేశంతో నిర్వాహకులు ఈ కార్యక్రమాన్ని ప్లాన్ చేశారు. అయితే ఈ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్న వారు పెద్దగా పాపులర్ లేనివారు కావడంతో చాలావరకు ఆసక్తి చూపించలేకపోయారు.. మొదటివారం ఈ కార్యక్రమం చాలా బోరింగ్ అనిపించిన రెండవ వారం మాత్రం కంటెస్టెంట్లు ప్రేక్షకులకు కావలసిన మంచి కంటెంట్ అందిస్తున్నారు. దీంతో ఈ కార్యక్రమం పై కూడా మరి కాస్త అంచనాలు పెరుగుతున్నాయి.
ఇక ఈ కార్యక్రమం సెప్టెంబర్ ఒకటవ తేదీ ఎంతో ఘనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే లాంచింగ్ ఎపిసోడ్ భారీ స్థాయిలో రేటింగ్ కైవసం చేసుకుందని తెలుస్తోంది. ఈ కార్యక్రమం ఓపెనింగ్ రోజున 18.9 టీఆర్పీతో దుమ్ము రేపింది. ఈ మధ్యకాలంలో ఇంతటి రేటింగ్ రాబట్టి షో మరోటి లేదనే విషయాన్ని స్టార్ మా వెల్లడించింది.
ఇక బిగ్ బాస్ తెలుగు చరిత్రలోనే ఈ స్థాయిలో రేటింగ్ ఇప్పటివరకు ఏ సీజన్ కూడా కైవసం చేసుకోలేదని సమాచారం.ఈ షోకు పెరుగుతున్న ఆదరణ, యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ ఆదరించిన తీరుకు ఇది నిదర్శనం అంటూ టీవీ వర్గాలు పేర్కొన్నాయి. ఇక ఈ కార్యక్రమం ప్రారంభం రోజు 14 మంది కంటెస్టెంట్లు హౌస్ లోకి వెళ్ళగా మొదటి వారం హౌస్ నుంచి ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యారు. అయితే ఐదవ వారంలో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా మరి కొంతమంది హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది.
Also Read : Bigg Boss 8: బిగ్ బాస్ హౌస్ లోకి చేతి వాచ్ కి అనుమతి లేదా..కారణం అదేనా?