Imanvi: ఇమాన్వీ యూట్యూబ్ ఆదాయం 2 లక్షలు… ప్రభాస్ సినిమాకు రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

2 Min Read

Imanvi: యూట్యూబర్, డాన్స్ కొరియోగ్రాఫర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో ఇమాన్వి ఒకరు. నిన్నటి వరకు ఈమె పేరు బహుశా చాలామందికి తెలియకపోవచ్చు కానీ కేవలం ఒక్క రోజుతోనే ఈమె పాపులర్ సెలెబ్రెటీగా మారిపోయారు. ఇలా ఒక్క రోజులోనే ఈ స్థాయిలో ఈమెకు క్రేజ్ రావడానికి కారణం ప్రభాస్ సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేయడమే. ప్రభాస్ ప్రస్తుతం హను రాఘవ పూడితో సినిమా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే .ఈ సినిమాలో హీరోయిన్గా ఇమాన్వి ఛాన్స్ కొట్టేశారు.

అయితే ఈమె ఇదివరకు డాన్స్ కొరియోగ్రాఫర్ గా యూట్యూబర్ గా పలు వీడియోలు చేస్తూ ఉండేవారు ఆడిషన్స్ ద్వారా ఈమెను సెలెక్ట్ చేసినట్టు డైరెక్టర్ వెల్లడించారు. అయితే ప్రభాస్ సినిమాకు కమిట్ కానంతవరకు కేవలం ఐదు లక్షల ఫాలోవర్స్ ని సొంతం చేసుకున్న ఈమెకు ఒక్క రోజులోనే రెండు లక్షలకు పైగా ఫాలోవర్స్ పెరిగిపోయారు.. అంతేకాకుండా ఈమె తన యూట్యూబ్ ద్వారా నెలకు 2 నుంచి 5లక్షల వరకు ఆదాయం అందుకునేవారు. కానీ ఇప్పుడు ప్రభాస్ తో సినిమాకు కమిట్ కావడంతో ఈమె రెమ్యూనరేషన్ గురించి హాట్ టాపిక్ గా మారింది.

ప్రభాస్ సినిమా అంటే కచ్చితంగా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇక ఈ సినిమా కూడా భారీ బడ్జెట్ తోనే తెరకెక్కబోతుంది. ఈ క్రమంలోనే ప్రభాస్ సినిమాలో నటిస్తున్నందుకు ఈమె ఎంత మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుంటుందనే విషయంపై ఆసక్తి నెలకొంది. అయితే తాజాగా ఈమె రెమ్యూనరేషన్ గురించి ఒక వార్త వైరల్ అవుతుంది.

ఇలా యూట్యూబ్ ద్వారా లక్షల్లో ఆదాయం తీసుకొనే ఇమాన్వి ప్రస్తుతం ప్రభాస్ సినిమాకు ఏకంగా కోటి రూపాయలు రెమ్యూనరేషన్ అందుకోబోతున్నారని సమాచారం. ఏది ఏమైనా ఈమె తెలుగులో గట్టి ఎంట్రీ ఇవ్వబోతుంది అని చెప్పొచ్చు. కాగా ఈ చిత్రాన్ని కూడా హను రాఘవపూడి పీరియాడిక్ నేపథ్యంలో ప్లాన్ చేస్తుండగా ప్రభాస్ భారత్ సైన్యంలో ఒకడిగా కనిపిస్తాడని కన్ఫర్మ్ అయ్యింది.

Share This Article