Annavaram Movie: సాధారణంగా ఒక సినిమా కథ రాసేటప్పుడు కొంతమంది హీరోలను దృష్టిలో పెట్టుకొని రచయితలు సినిమా కథ రాస్తారు అయితే కొన్ని కారణాలవల్ల ఆ హీరోతో ఆ సినిమాలు చేయలేకపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇలా కొంతమంది హీరోలు మిస్ చేసుకున్న సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. మరి కొంతమంది ఈ సినిమాని వదులుకొని మంచి పని చేశాము అనే భావన కలిగేలా డిజాస్టర్ గా కూడా నిలిచిపోయాయి.
ఇలా స్టార్ హీరో బాలయ్య కూడా ఎన్నో సూపర్ హిట్ సినిమాలను వదులుకున్నారు. అలాంటి చిత్రాలలో అన్నవరం సినిమా కూడా ఒకటి. డైరెక్టర్ భీమినేని శ్రీనివాసరావు ముందుగా ఈ సినిమా కథను బాలకృష్ణ గారితో చేయాలని భావించారట. ఈ సినిమా కథతో బాలయ్య వద్దకు వెళ్లిన శ్రీనివాస్ కి చేదు అనుభవమే ఎదురయింది. సినిమా కథ మొత్తం విన్న బాలకృష్ణ కథ నచ్చిందని తెలిపారు.
ఇకపోతే ఈ సినిమా సిస్టర్ సెంటిమెంట్ తో కూడుకున్న నేపథ్యంలో ఈ సినిమాని బాలయ్య రిజెక్ట్ చేశారట. అప్పటికే బాలకృష్ణ ఎన్నో సిస్టర్ సెంటిమెంట్ సినిమాలలో నటించిన నేపథ్యంలో ఏదైనా కొత్తగా ప్రయత్నిద్దాము అనే ఒక కారణంతోనే ఈ సినిమాని రిజెక్ట్ చేశారు. ఈ విధంగా బాలకృష్ణ రిజెక్ట్ చేయడంతో దర్శకుడు పవన్ కళ్యాణ్ ను సంప్రదించారు. ఇక పవన్ కళ్యాణ్ కు ఈ సినిమా కథ బాగా నచ్చడంతో ఈ సినిమా సెట్స్ పైకి వచ్చింది. ఇక షూటింగ్ పూర్తి చేసుకుని 2006 డిసెంబర్ 29వ తేదీ ఈ సినిమా విడుదల అయింది.
అప్పటికే పవన్ కళ్యాణ్ నటించిన గుడుంబా శంకర్, జానీ, బంగారం లాంటి వరుస ఫ్లాప్ సినిమాలతో సతమతమవుతున్న ఆయనకు అన్నవరం సినిమా కొంతమేర ఉపశమనం కలిగించిందని చెప్పాలి. ఇక హీరోయిన్ విషయంలో కూడా ముందుగా ఈ సినిమాలో అనుష్కను తీసుకోవాలని భావించారట అయితే అప్పటికే ఆమె పలు సినిమా పనులలో బిజీగా ఉన్న నేపథ్యంలో ఆసిన్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. ఇక ఈ సినిమాకు ఆర్ బీ చౌదరి నిర్మాతగా వ్యవహరించారు. అయితే పవన్ కళ్యాణ్ కు చెల్లి పాత్రలో తమిళ నటి సంధ్య ఈ సినిమాలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.