Jani Master : జానీ మాస్టర్ విషయంలో అల్లు అర్జున్ పై ట్రోల్.. అలా రియాక్ట్ అయిన మాస్టర్!

2 Min Read

Jani Master: సినీ ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో జానీ మాస్టర్ ఒకరు. ఈయన హీరోల బాడీ లాంగ్వేజ్ అనుగుణంగా డాన్స్ కంపోజ్ చేస్తూ సూపర్ హిట్ సక్సెస్ లను అందిస్తూ ఉంటారు ఇలా ఇండస్ట్రీలో ఉన్నటువంటి స్టార్ హీరోలు అందరికీ కూడా ఎంతో అద్భుతమైన పాటలకు కొరియోగ్రాఫర్ గా జానీ మాస్టర్ పనిచేశారు.

ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో జానీ మాస్టర్ దాదాపు అందరూ హీరోలతో పనిచేశారు. ముఖ్యంగా అల్లు అర్జున్ తో ఈయనకు ఎంతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. అల్లు అర్జున్ సినిమాలలోని మీ ఇంటికి ముందో గేటు(జులాయి),కమ్ టు ది పార్టీ (సన్ ఆఫ్ సత్యమూర్తి),సినిమా చూపిస్తా మావ(రేసు గుర్రం) , బుట్ట బొమ్మ(అలా వైకుంఠపురములో) వంటి వాటికి అద్భుతమైన కొరియోగ్రఫీ అందించాడు జానీ మాస్టర్.

ఇలా అల్లు అర్జున్ కు ఎన్నో సూపర్ హిట్ పాటలను అందించడంతో అల్లు అర్జున్ జానీ మాస్టర్ మధ్య ఎంతో మంచి సాన్నిహిత్యం ఉంది. ఇకపోతే జానీ మాస్టర్ ఇటీవల తమిళ చిత్రం అయిన తిరుచిత్రంబలం సినిమాలో మేఘం అనే పాటకు కొరియోగ్రఫీ చేశారు. ఇక ఈ పాటకు గాను ఈయనకు ఉత్తమ కొరియోగ్రాఫర్ గా నేషనల్ అవార్డు రావడంతో చిత్ర పరిశ్రమ మొత్తం ఈయనకు అభినందనలు తెలియజేస్తున్నారు.

ఈ క్రమంలోనే అల్లు అర్జున్ కు ఎంతో బెస్ట్ ఇచ్చిన జానీ మాస్టర్ నేషనల్ అవార్డు అందుకోబోతున్న నేపథ్యంలో ఆయన మాత్రం శుభాకాంక్షలు తెలియజేయకపోవడంతో ఇది కాస్త పెద్ద ఎత్తున వివాదంగా మారుతుంది. అల్లు అర్జున్ జానీ మాస్టర్ కు శుభాకాంక్షలు చెప్పకపోవడానికి కారణం ఆయన జనసేన పార్టీకి సపోర్ట్ చేయడమే అంటూ పలువురు అభిమానులు అల్లు అర్జున్ పై భారీ స్థాయిలో ట్రోల్స్ చేస్తున్నారు.

జానీ మాస్టర్ పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని దీంతో ఆయన జనసేన పార్టీలోకి వెళ్లడం అలాగే పార్టీ ప్రచార కార్యక్రమాలను చేయడం జరిగింది. ఒకానొక సమయంలో ఈయన కూడా ఎమ్మెల్యేగా టికెట్ అందుకొని పోటీ చేయబోతున్నారని వార్తలు వచ్చాయి. కానీ పొత్తులో భాగంగా అది కుదరడం లేదు అయినప్పటికీ జానీ మాస్టర్ జనసేన జెండా మోసారు. అయితే అల్లు అర్జున్ జనసేన పార్టీకి కాకుండా వైకాపా పార్టీకి మద్దతు తెలిపారు.

ఈ కారణం చేతనే అల్లు అర్జున్ జానీ మాస్టర్ కు శుభాకాంక్షలు చెప్పలేదని విమర్శలు వచ్చాయి. తాజాగా అల్లు అర్జున్ పై వస్తున్న ఈ విమర్శల గురించి జానీ మాస్టర్ స్పందించారు. అల్లు అర్జున్ నాకు ఎందుకు విషెస్ చెప్పలేదో నాకు కూడా తెలియదు బహుశా ఆయన మరిచిపోయి ఉండవచ్చు. నేనైతే ఈ విషయాన్ని నెగిటివ్ గా తీసుకోవడం లేదు నిజానికి బుట్ట బొమ్మ పాటకే నేషనల్ అవార్డు వస్తుందని భావించాను కానీ ఈ పాటకు వచ్చింది నేనెప్పుడూ కూడా నా కష్టాన్ని నమ్ముకుంటాను అంటూ జానీ మాస్టర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Share This Article