Thamannah: ఐటమ్ సాంగ్ అంటే ఒకప్పుడు జయమాలిని సిల్క్ స్మిత వంటి స్పెషల్ డాన్సర్స్ గుర్తుకు వచ్చేవారు కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది హీరోయిన్లే ఐటమ్ సాంగ్స్ చేస్తూ రెండు చేతుల సంపాదిస్తున్నారు ఇలా ఐటమ్ సాంగ్స్ చేసేవారిలో తమన్నా ముందు వరుసలో ఉంటారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ గా కొనసాగిన శృతిహాసన్, శ్రేయ, కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే, సమంత వంటి స్టార్ హీరోయిన్స్ అందరూ కూడా స్పెషల్ సాంగ్స్ చేసిన సంగతి తెలిసిందే.
ఇక ఇలా స్పెషల్ సాంగ్స్ లో కనుక తమన్నా నటించిన అంటే ఆ సినిమా పక్క బ్లాక్ బాస్టర్ అనే సెంటిమెంట్ కూడా అందరిలోనూ ఉంది. ఇప్పటివరకు తమన్నా స్పెషల్ సాంగ్స్ నటించిన లవకుశ, సరిలేరు నీకెవ్వరు, అల్లుడు శీను, జైలర్ వంటి సినిమాలలో ఈమె స్పెషల్ సాంగ్స్ చేశారు. ఈ సినిమాలన్నీ కూడా చాలా మంచి సక్సెస్ అయ్యాయి. దీంతో ఈమెకు స్పెషల్ సాంగ్స్ విషయంలో కూడా భారీగా క్రేజ్ పెరిగిపోయింది.
తమన్నా ఒకవైపు బాలీవుడ్ సినిమాలు వెబ్ సిరీస్ లో నటిస్తూనే మరోవైపు బాలీవుడ్ సినిమాలలో స్పెషల్ సాంగ్స్ కూడా చేస్తున్న సంగతి తెలిసినదే. తాజాగా ఈమె మరొక స్పెషల్ సాంగ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అమర్ కౌశిక్ దర్శకత్వంలో కామోడీ హార్రర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన స్త్రీ 2 అనే సినిమా ఆగస్టు 15వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.
ఇక ఈ సినిమాలో ఆజ్ కీ రాత్ అంటూ వచ్చే స్పెషల్ సాంగ్ లో ఈమె అదరగొట్టారు. కంటి చూపుతో నడుము ఒంపు సొంపులతో కుర్రకారులను కట్టిపడేశారు. ఇక ఈ పాటకు ఎంతో మంచి క్రేజ్ రావడమే కాకుండా ఈ సినిమా కూడా మంచి సక్సెస్ కావడంతో ఐటమ్ సాంగ్ విషయంలో మరోసారి తమన్నా సెంటిమెంట్ కూడా వర్కౌట్ అయింది. ఇక ఈ సినిమా లోని ఈ పాట సుమారు ఐదు నిమిషాల పాటు నిడివి ఉంది.
ఇలా ఈ ఐదు నిమిషాల పాటు తెరపై తన డాన్స్ తో అందరిని మెప్పించిన తమన్నా ఈ పాట కోసం ఏకంగా కోటి రూపాయలు రెమ్యూనరేషన్ అందుకున్నారని తెలుస్తుంది. ఇలా స్పెషల్ సాంగ్ కోసం కోటి రూపాయల రెమ్యూనరేషన్ అంటే మామూలు విషయం కాదు. ఈ సినిమా మొదటి భాగం స్త్రీ సినిమాలో స్పెషల్ సాంగ్లో బాలీవుడ్ నటి నోరా ఫతేహీ నటించారు ఈమె అప్పట్లో 25 లక్షలు తీసుకున్నారని సమాచారం. ఈమె తీసుకున్న దానికంటే తమన్నా నాలుగు రెట్లు అధికంగా తీసుకున్నారని తెలుస్తోంది.