ప్రెగ్నెన్సీ కోసం లక్షలు ఖర్చు పెడుతున్న Rashmika బయటపడిన బాగోతం?

2 Min Read

నేషనల్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇక ఈమె త్వరలోనే పుష్ప 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇలా ఈ సినిమాతో పాటు మరికొన్ని పాన్ ఇండియా సినిమాలతో పాటు బాలీవుడ్ సినిమాలకి కూడా కమిట్ అయ్యారు. సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉంటే రష్మిక సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు.

ఇకపోతే తాజాగా రష్మికకు సంబంధించి ఒక వార్త సంచలనంగా మారింది. ఇటీవల కాలంలో హీరోయిన్లు భవిష్యత్తులో ప్రెగ్నెన్సీ అవ్వడం కోసం ఇప్పుడే ఎగ్ ఫ్రీజ్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. కొంతమంది హీరోయిన్లు అవగాహన కోసం వీడియోలను కూడా అభిమానులతో పంచుకున్నారు. అయితే తాజాగా రష్మిక సైతం తన ప్రెగ్నెన్సీ కోసం లక్షల ఖర్చు చేస్తున్నారంటూ ఒక వార్తా హల్చల్ చేస్తోంది.

ఈ వార్త బయటకు రావడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అదేంటి పెళ్లి కాకుండానే గర్భం కోసం రష్మిక లక్షలు ఖర్చు చేయడం అంటూ షాక్ అవుతున్నారు. అయితే ఆమె నిజజీవితంలో ప్రెగ్నెన్సీ రావడం కోసం లక్షలు ఖర్చు చేస్తున్నారు అంటే మనం పప్పులో కాలు వేసినట్టే. ఈమె సినిమాలో భాగంగా ఇలా డబ్బు ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది.

Rashmika Mandanna

పుష్ప సినిమాలో ఈమె అల్లు అర్జున్ కి ప్రేయసిగా కనిపించారు. ఇక ఈ సినిమా సీక్వెల్ లో భార్యగా కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సినిమాలో రష్మిక ప్రెగ్నెన్సీ పాత్రలో నటించడం కోసం సుకుమార్ ఏకంగా 15 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారంటూ వార్తలు బయటకు రావడంతో అందరూ షాక్ అవుతున్నారు. ప్రెగ్నెన్సీ తో కనిపించడం కోసమే 15 లక్షలు ఖర్చు చేయడం ఏంటి అంటూ ముక్కున వేలు వేసుకుంటున్నారు.

ఇక ఈ సినిమా ఆగస్టు 15వ తేదీనే విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాలవల్ల సినిమా వాయిదా పడుతూ డిసెంబర్ 6వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది. ఇలాంటి తరుణంలో ఈ సినిమా కోసం మేకర్స్ పెద్ద ఎత్తున వడ్డీలు చెల్లించాల్సి వస్తుందని, దీంతో నిర్మాతలపై అదనపు భారం పడుతుందని తెలుస్తోంది. ఇక ఎలాంటి అడ్డంకులు ఎదురైనా డిసెంబర్ 6వ తేదీనే ఈ సినిమా రాబోతుందని ఇప్పటికే మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.

TAGGED:
Share This Article