Rashmika : రష్మిక మందన్న ప్రస్తుతం నేషనల్ క్రష్ పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. రష్మిక మందన్న ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో పాటు సౌత్ సినిమాలు అలాగే పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ ఏమాత్రం తీరిక లేకుండా గడుపుతున్నారు ఇలా సినిమా షూటింగ్ పనుల నిమిత్తం బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.
ఇక సోషల్ మీడియాలో తన విషయాలను తెలియచేయడమే కాకుండా ఈమె తరచూ తన డైరీ పేజ్ కూడా లీక్ చేస్తూ వాటిని షేర్ చేస్తూ ఉంటారు ఆరోజు మొత్తం ఏం చేసిందనే విషయాలను కూడా తెలియజేస్తూ ఉంటారు. తాజాగా ఈమె తన డైరీలోని ఒక పేజ్ ను ఈమె షేర్ చేశారు. ఇందులో భాగంగా రోజువారి కార్యక్రమాలలో ఆమె చేసిన పనులతో పాటు తన పెట్ ఆరాతో గడిపిన క్షణాలను అభిమానులతో పంచుకున్నారు.
రష్మిక మందన్న స్టార్ హీరోయిన్ అయినప్పటికీ కూడా ఈమె ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి లైఫ్ ను ఇష్టపడతారనే సంగతి మనకు తెలిసిందే. తనకు ఎక్కువగా రుచికరమైన ఆహార పదార్థాలను తినడం సరదా సరదాగా తన కుక్క ఆరాతో ఆడుకోవడం, పుస్తకాలు చదవడం, నిద్రపోవడం నాకు చాలా సరదాగా అనిపిస్తుందని రష్మిక తెలిపారు.
ఇక రోజు వారి కార్యక్రమాలలో భాగంగా వ్యాయామం చేయటం కూడా చాలా ఇష్టమని తెలిపారు. అయితే వ్యాయామం చేస్తూనే తనకు రుచికరమైన ఆహార పదార్థాలు కనుక కనిపిస్తే అసలు ఆగలేకపోతున్నానని తెలిపారు. చాలామందికి ఇలాంటి సమస్య ఉంటుంది. ఈ విషయాలు నా జీవితంలో లేకుండా నేను ఉండలేను. చాలామంది నన్ను నటిగా చూసినా, నా స్నేహితులు, కుటుంబ సభ్యులు నన్ను ఎప్పుడూ ఇలానే చూస్తారని రష్మిక తన జీవితంలో ఓ రోజు ఎలా గడిచిపోయిందనే విషయాలన్నింటిని కూడా తన డైరీలో రాసుకున్న పేజీని బయటకు పెట్టడంతో రష్మిక స్టార్ హీరోయిన్గా బిజీగా గడుపుతున్న తనకంటూ కొంత సమయం కేటాయిస్తారని తెలుస్తోంది.