Devara: దేవర ఒక్క ఫైట్ కోసం పది కోట్లు… తేడా కొట్టిందో అంతే సంగతులు!

2 Min Read

Devara: టాలీవుడ్ ఇండస్ట్రీలో త్వరలోనే రాబోతున్న అతిపెద్ద పాన్ ఇండియా సినిమాలలో దేవర సినిమా కూడా ఒకటి. డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. మొదటి భాగం సెప్టెంబర్ 27వ తేదీ విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో ఈ సినిమాకు సంబంధించి ఎన్నో విషయాలు వైరల్ అవుతున్నాయి.

ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న నేపథ్యంలో ఎంతోమంది బాలీవుడ్ సెలబ్రిటీలను కూడా ఈ సినిమాలో భాగం చేసిన సంగతి తెలిసిందే. ఇకపోతే ఈ సినిమా క్లైమాక్స్ సీన్ కోసం చిత్ర బృందం స్పెషల్ ఫోకస్ పెట్టారని తెలుస్తుంది. ఈ ఒక్క ఫైట్ సన్నివేశంతోనే సినిమా టాక్ మొత్తం మారిపోతుందని సమాచారం. ఈ క్లైమాక్స్ సీన్ కోసం ఏకంగా నిర్మాతలు 10 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ సన్నివేషంలో పెద్ద ఎత్తున గ్రాఫిక్స్ కూడా ఉండబోతున్నాయని అలాగే సీజీ వర్క్ కూడా భారీగా ఉన్న నేపథ్యంలో ఖర్చు కూడా భారీగా పెరుగుతోందని తెలుస్తుంది. అయినప్పటికీ నిర్మాతలు ఏమాత్రం వెనకడుగు వేయకుండా ఈ సీన్ కోసం భారీ స్థాయిలో డబ్బు ఖర్చు చేశారని తెలుస్తోంది.

NTR Devara
NTR Devara

ఇలా ఒక్క సీన్ కోసమే కొరటాల 10 కోట్ల రూపాయలు ఖర్చు చేయించారనే విషయం తెలియడంతో ఈ సినిమా పై భారీ స్థాయిలోనే అంచనాలు ఉన్నాయి. అయితే ఈ ఫైట్ సీన్ కనుక మంచిగా వచ్చి ఉంటే పర్వాలేదు కానీ ఏ మాత్రం తేడా కొట్టిన భారీ నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ఈ సినిమా విషయంలో కొరటాల శివ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆచార్య డిజాస్టర్ కావడంతో ఎలాగైనా తానేంటో నిరూపించుకోవాలని దేవర సినిమాని కసిగా చేస్తున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా ఇటు ఎన్టీఆర్ అటు కొరటాలకు కూడా చాలా కీలకంగా మారింది.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు .

TAGGED:
Share This Article