Coolie : కూలీలో రజినీ పేరు రివీల్… ఆ బ్లాక్ బస్టర్ మూవీకి లింక్ పెడుతున్న లోకేష్

2 Min Read

Coolie : సూపర్ స్టార్ రజనీకాంత్ లేటెస్ట్ మూవీ కూలీ నుండి మరో క్రేజీ అప్ డేట్ వచ్చింది. గత కొన్ని రోజులుగా ఈ చిత్రంలో నటిస్తున్న నటీనటుల పాత్రలను పరిచయం చేస్తూ దర్శకుడు లోకేష్ కనగరాజ్ వరుసగా పోస్టర్లను విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా రజనీకాంత్ పాత్ర పేరును తెలుపుతూ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. అయితే ఈ పోస్టర్ ఇప్పుడు మరో కొత్త చర్చకు తెర లేపింది. ఈ సినిమాలో రజనీకాంత్ క్యారెక్టర్ లోకి పెట్టిన పేరు చూసి సూపర్ స్టార్ గతంలో చేసిన ఎవర్ గ్రీన్ సినిమాకు లింక్ పెడుతున్నారా? అనే అనుమానాలు మొదలయ్యాయి.

తలైవా రజనీకాంత్ ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కూలీ సినిమాలో నటిస్తున్నారు. రజనీ కెరీర్‌లో ఇది 171వ సినిమా. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించారు. గత కొద్దిరోజులుగా ఈ సినిమాలో నటించే నటీనటుల పేర్లు, వారి పాత్రల వివరాలు వెల్లడయ్యాయి. ఇలా స్పెషల్ పోస్టర్ల ద్వారా సినిమాలోని ప్రధాన పాత్రధారులైన షౌబిన్ సాహిర్, నాగార్జున, శృతి హాసన్, ఉపేంద్ర, సత్యరాజ్ తదితరుల పాత్రలను విడుదల చేశారు. ఇప్పుడు కూలీలో రజనీ పాత్ర పేరును చిత్ర బృందం వెల్లడించింది. సినిమాలో రజనీ పాత్ర పేరు దేవ్. అయితే రజనీ లాస్ట్ సూపర్ హిట్ సినిమాకి లింక్ పెట్టి చూస్తున్నారు అభిమానులు.

రజనీకాంత్, మమ్ముట్టి జంటగా మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన దళపతి సినిమా అప్పట్లో ఏ రేంజ్ హిట్ కొట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సూర్య పాత్రలో రజనీ, దేవా పాత్రలో మమ్ముట్టి నటించారు. ఇప్పుడు కూలీలో అప్పటి దళపతి సినిమాలో తన బెస్ట్ ఫ్రెండ్ దేవా (మమ్ముట్టి) పేరు పెట్టాడని కొందరు అంటున్నారు. దీంతో దళపతికి శ్రమతో సంబంధం ఉందా అనే ప్రశ్న తలెత్తుతోంది. ప్రముఖ తమిళ సంగీత స్వరకర్త దేవాకు రజనీ పాత్ర పేరు పెట్టారని మరికొందరు అభిప్రాయపడ్డారు. అలాగే, ఈ పోస్టర్‌లో 1421 నంబర్‌ను హైలైట్ చేశారు. మరి అసలు ఈ సినిమాతో దర్శకుడు లోకేష్ ఏం ప్లాన్ చేస్తున్నాడో తెలియాలంటే సినిమా విడుదల అయ్యేంత వరకు ఆగాల్సిందే.

దేవ్ గా రజనీకాంత్, సైమన్ గా నాగార్జున అక్కినేని, దయాళ్ గా సౌబిన్ షాహిర్, ప్రీతిగా శృతి హాసన్, రాజశేఖర్ గా సత్యరాజ్, కలిషాగా ఉపేంద్ర కూలీ సినిమాలో నటించబోతున్నారు. ఇప్పటి వరకు కూలీ నుంచి విడుదలైన ఈ పాత్రలన్నీ సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి. ఈ సినిమాలో కీలక పాత్రలో నటించేందుకు కింగ్ నాగార్జున భారీ పారితోషికాన్ని తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, ఈ చిత్రాన్ని 2025లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Share This Article