Devara : ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర దేవర దండయాత్ర కొనసాగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా దేవర మ్యానియా నడుస్తోంది. థియేటర్లో దేవర మాస్ జాతర చేస్తున్నారు అభిమానులు. ఫస్ట్ డే అర్థరాత్రి ఒంటి గంటకే షో స్టార్ట్ అవగా.. ఏకంగా 172 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టింది దేవర. అయితే.. రెండో రోజు మాత్రం భారీ డ్రాప్ కనిపించింది. కలెక్షన్స్ సగానికి సగం పడిపోయాయి. శనివారం వీకెండ్ అయినా కూడా.. 71 కోట్లు మాత్రమే కొల్లగొట్టింది.
మొత్తంగా రెండు రోజులకు గాను వరల్డ్ వైడ్ 243 కోట్లు రాబట్టింది దేవర. ఇక మూడో రోజు సండే అవడంతో.. దేవర మరో సెంచరీ కొడతాడని అనుకున్నారు. సెకండ్ డే కంటే ఎక్కువ వసూళ్లు వస్తాయని లెక్కలు వేశారు. కానీ సండే నాడు కేవలం 61 కోట్లు మాత్రమే రాబట్టింది దేవర(Devara). మొత్తంగా మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 304 కోట్లు కలెక్షన్స్ కొల్లగొట్టినట్టుగా అధికారకంగా పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్.
Also Read : Devara : దేవర సినిమాని చుట్టుముడుతున్న బ్యాడ్ సెంటిమెంట్స్… సెంటిమెంట్లను బ్రేక్ చేసేనా?
Devara: A Grand Success with ₹300 Crores in Just 3 Days!
అయితే.. మిక్స్డ్ టాక్‌తో దేవర సెన్సేషన్ క్రియేట్ చేసిందనే. ఈ సినిమాతో సోలోగా ఎన్టీఆర్ 300 కోట్ల క్లబ్లో ఎంటర్ అయ్యాడు. ఈ వారంలో దేవర బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అయి.. లాభాల బాట పట్టనున్నాడు. దేవర థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ 180 కోట్లు జరగ్గా.. మరో 50-60 కోట్ల గ్రాస్ రాబడితే బ్రేక్ అవెన్ అయినట్టే. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను దేవర చాలా స్ట్రాంగ్ హోల్డ్ కనబరుస్తోంది.
ఇక కొరటాల శివల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా.. సెప్టెంబర్ 27న భారీ ఎత్తున రిలీజ్ అయింది. ఎన్టీయార్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్, మలయాళ నటుడు టామ్ చాకో కీలక పాత్రల్లో నటించారు. అనిరుధ్ మ్యూజిక్ ఈ సినిమాను వేరే లెవల్‌కు తీసుకెళ్లింది. ఏదేమైనా.. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తగా దేవర దండయాత్ర సాగుతోంది.